డబుల్ యూనిట్ కింద.. ఎల్బీనగర్, అంబర్ పేట, జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, షాద్‌నగర్‌లలో ఫైర్ స్టేషన్లు రానున్నాయి. సింగిల్ యూనిట్ కింద డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్, నర్సాపూర్, హుస్నాబాద్, కల్వకుర్తి, బాల్కొండ, ధర్మపురితోపాటు పినపాక నియోజకవర్గాల్లో ఫైర్ స్టేషన్లు మంజూరయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
సింగిల్ యూనిట్లలో ఒక స్టేషన్ ఫైర్ ఆఫీసర్, లీడింగ్ ఫైర్‌మెన్ 2, డ్రైవర్ ఆపరేటర్ 3, ఫైర్‌మెన్ 10, జూనియర్ అసిస్టెంట్ 1, స్వీపర్ 1 చొప్పున .. మొత్తం 18 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిలో స్వీపర్ మినహా మిగతావన్నీ రెగ్యులర్ పోస్టులు. స్వీపర్లను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)