BRS: బీఆర్ఎస్ కొత్త జెండా, కండువాను చూశారా? అంతా సేమ్.. అదొక్కటే చేంజ్..
BRS: బీఆర్ఎస్ కొత్త జెండా, కండువాను చూశారా? అంతా సేమ్.. అదొక్కటే చేంజ్..
BRS: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. ఇక నుంచి టీఆర్ఎస్ మాటే వినిపించదు. బీఆర్ఎస్ మాత్రమే కనిపిస్తుంది. వినిపిస్తుంది. మరి బీఆర్ఎస్ జెండా ఎలా ఉంది? ఎలాంటి మార్పులను చేశారో తెలుసుకుందాం.
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఫైలుపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంతకం పెట్టారు. అనంతరం తెలంగాణ భవన్పై కొత్త జెండాను ఆవిష్కరించారు.
2/ 6
ఈ కార్యక్రమానికి మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇతర నేతలతో పాటు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, ప్రకాశ్ రాజ్, పలు రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు తరలివచ్చారు.
3/ 6
కుమారస్వామి, పార్టీ సీనియర్ నేత కేకే, ఇతర నేతలతో కలిసి బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
4/ 6
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త బీఆర్ఎస్ కండువాను కప్పుకున్నారు. ఇతర నేతలు కూడా కొత్త కండువాలతో కనిపించారు.
5/ 6
తెలంగాణ భవన్లోని పాత టీఆర్ఎస్ ఫొటోలు, ఫ్లెక్సీలు, జెండాలను తొలగించి.. వాటి స్థానంలో కొత్త బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
6/ 6
బీఆర్ఎస్ జెండా కూడా గులాబీ రంగులోనే ఉంది. ఐతే గతంలో 33 జిల్లాలతో కూడిన తెలంగాణ మ్యాప్, దాని కింద టీఆర్ఎస్ అని ఉండేది. ఐతే వాటి స్థానాల్లో ఇండియా మ్యాప్, బీఆర్ఎస్ అక్షరాలు వచ్చాయి. అంతే తేడా.. మిగతా అంతా సేమ్.