CM KCR | Yashwant Sinha: కాంగ్రెస్ నేతతో కలిసి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
CM KCR | Yashwant Sinha: కాంగ్రెస్ నేతతో కలిసి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
CM KCR Welcomes Yashwant Sinha: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఆయన స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు వెల్కమ్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హైదరాబాద్కు వచ్చిన ఆయనకు.. టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. ఆయన స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి యశ్వంత్ సిన్హాకు వెల్కమ్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా.. హైదరాబాద్కు వచ్చిన ఆయనకు.. టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
2/ 6
తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు కేసీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. వారంతా యశ్వంత్ సిన్హాకు శాలువగా కప్పి.. పుష్ఫ గుచ్ఛం అందించి.. స్వాగతం పలికారు.
3/ 6
అనంతరం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. జల విహార్ వరకు 20వేల మందితో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వివేకానంద గౌడ్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
4/ 6
జలవిహార్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో యశ్వంత్ సిన్హా సమావేశమవుతారు. గులాబీ నేతలతో కలిసి లంచ్ చేస్తారు.
యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు వెళ్లకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కానీ అనూహ్యంగా సీనియర్ నేత వీహెచ్ ఎయిర్పోర్టులో ప్రత్యక్షమయ్యారు. సీఎం కేసీఆర్తో కలిసి యశ్వంత్ సిన్హాకు ఘనస్వాగతం పలికారు.