Ugadi Wishes: 'శోభాకృత్' లో కొత్త శుభాలు చేకూర్చాలి..రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఉగాది శుభాకాంక్షలు
Ugadi Wishes: 'శోభాకృత్' లో కొత్త శుభాలు చేకూర్చాలి..రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఉగాది శుభాకాంక్షలు
Ugadi Wishes: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శోభాకృత్ నామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు కలగాలని ఈ సందర్బంగా వారు ఆకాంక్షించారు.
Ugadi Wishes: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ శోభాకృత్ నామ సంవత్సరంలో ప్రజలకు శుభాలు కలగాలని ఈ సందర్బంగా వారు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై (పాత ఫొటో)
2/ 6
రాష్ట్ర ప్రజలకు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
3/ 6
సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని సీఎం తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని సీఎం అన్నారు.
4/ 6
తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 'శోభకృత్’ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం ఆకాంక్షించారు. (Pc: Twitter/ Telangana Cmo)
5/ 6
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలిపారు.
6/ 6
ఈ ఉగాది ప్రజలందరి జీవితాలలో ఆరోగ్యాన్ని,అభివృద్ధిని, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ ట్వీట్ చేశారు. (Pc: Twitter/Tamilisai Governor)