తెలంగాణలో చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత వారం బాయిలర్ చికెన్ ధర కిలో రూ.220 ఉండగా.. ఇప్పుడు 70 నుంచి 80 రూపాయల మేర తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.140 నుంచి రూ.150 గా ఉంది. గత వారం కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్ ధర ఇప్పుడు రూ.80 మాత్రమే పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
వేసవి కారణంగా 30 శాతం వరకు వినియోగం తగ్గడం.. ధరలపైన ప్రభావం చూపిందని పౌల్ట్రీ పరిశ్రమ వ్యాపారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
అయితే కరోనా నేపథ్యంలో మాంసపు ప్రియులు ఇమ్యూనిటీ కోసం చికెన్ బాగా తింటుండంతో.. ధరలు ఆ మాత్రమైనా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
చికెన్ మాత్రమే కాదు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. హోల్‌సేల్‌గా 100 గుడ్లకు రూ. 50- 60 వరకు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
రిటైల్‌గా ప్రస్తుతం ఒక్కో కోడి గుడ్డు రూ.5 చొప్పున అమ్ముతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)