Chicken: నాన్‌వెజ్ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. అక్కడ కిలో చికెన్ 99 రూపాయలే..
Chicken: నాన్‌వెజ్ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. అక్కడ కిలో చికెన్ 99 రూపాయలే..
Chicken: మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.200కి తక్కువ లేదు. కానీ ఓ షాపలో మాత్రం 99 రూపాయలకే కిలో చికెన్ ఇస్తున్నారు. మరి అది ఎక్కడ ఉంది? ఇంత తక్కువ రేటుకే ఎలా ఇస్తున్నారో తెలుసుకుందాం.
మనలో చాలా మంది మాంసాహార ప్రియులు ఉన్నారు. కనీసం వారానికి ఒక్కసారైనా చికెన్, మటన్, చేపల వంటి ముక్కలు తినాల్సిందే. ఐతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మండిపోతున్నాయి. చాలా చోట్ల కిలో చికెన్ ధర రూ.200పైనే పలుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
కానీ ఓ చోట మాత్రం కిలో చికెన్ రూ.99కే లభిస్తోంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలో ఉన్న భారత్ చికెన్ సెంటర్లో కిలో కోడి మాంసం రేటు (Chicken Price) 99 రూపాయలు మాత్రమే. ఇతర షాపులతో పోల్చితే.. సగం రేటుకు చికెన్ అందిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
చికెన్ షాప్ కొత్తగా ప్రారంభిస్తే.. ఆ సమయంలో ప్రమోషన్స్ కింద.. ఇలాంటి ఆఫర్లు ఇస్తుంటారు. కానీ ఈ షాపు అలా కాదు. చాలా కాలం నుంచి ఉంది. అప్పుడప్పుడూ ఇలాంటి ఆఫర్లను పెట్టి..జనాలను ఆకర్షిస్తుంటామని షాప్ యజమాని ముజ్జూ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ముజ్జూకు కోళ్ల ఫారమ్‌లు ఉన్నాయట. కోళ్లను ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేయకుండా.. తానే స్వయంగా చికెన్ షాపును నిర్వహిస్తున్నాడు. తమ ఫామ్‌లలో పెరిగే కోళ్లను... తమ చికెన్ షాప్‌కే తీసుకొచ్చి..మాంసంగా కట్ చేసి.. అమ్ముతున్నాడు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఇతర షాప్‌లతో పోల్చితే తమ దుకాణంలో అతి తక్కువ ధరకే చికెన్ లభిస్తుందని మజ్జూ తెలిపారు. రూ.99 కే చికెన్ లభిస్తుండడంతో.. దస్తూరాబాద్ మండలంలోని ప్రజలు.. భారత్ చికెన్ షాప్‌కు ఎగబడుతున్నారు. చికెన్ కోసం బారులు తీరుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.220-250లుగా ఉంది. స్కిన్‌తో ఉండే చికెన్ ధర రూ.170కి అటూ ఇటూగా ఉంది. కానీ ఈ షాప్‌లో 99 రూపాయలకే చికెన్ లభిస్తుండడంతో..స్థానికులు మాంసం కోసం క్యూ కడుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)