Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న BRS ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు అధికారి జోగేంద్రకు సంచలన లేఖ రాశారు.
2/ 13
ఫోన్లను ధ్వంసం చేశారన్న ఆరోపణలు చేయడాన్ని లేఖలో తీవ్రంగా తప్పుపట్టారు .
3/ 13
దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని కవిత తెలిపారు.
4/ 13
ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యతా హక్కుకు భంగం కలిగించడం కాదా అని కవిత ప్రశ్నించారు.
5/ 13
"దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ.. నేను ఫోన్లను ధ్వంసం చేశానని తెలిపింది. నన్ను కనీసం అడగకుండా ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది?" అని కవిత లేఖలో ప్రశ్నించారు.
6/ 13
"నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే.. దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే" అని కవిత లేఖలో మండిపడ్డారు.
7/ 13
"తప్పుడు ఆరోపణలపై ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు" అని కవిత లేఖలో తెలిపారు.
8/ 13
"ప్రత్యర్థుల నిందల వల్ల నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువునూ, మా పార్టీ ప్రతిష్టనూ ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది" అని కవిత లేఖలో తెలిపారు.
9/ 13
"ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి... రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దురదృష్టకరం" అని కవిత లేఖలో తెలిపారు.
10/ 13
ఇవాళ మూడోసారి ఉదయం 11.30కి ఈడీ ఆఫీసులోకి వెళ్లారు కవిత. వెళ్లే ముందు ఆమె... సీఎం ఇంటి నుంచి ఈడీ ఆఫీసుకు బయలుదేరుతూ... మీడియాకి తన ఫోన్లను ప్రదర్శించారు.
11/ 13
ఎమ్మెల్సీ కవిత.. రెండు సిమ్‌లను వాడి... దాదాపు 10 ఫోన్లను మార్చారని తెలుస్తోంది. ఆ ఫోన్లను ధ్వంసం చేశారనే ప్రచారం జరిగింది. ఆ ఫోన్లను తీసుకురావాలని ఈడీ అధికారులు కోరడంతో.. ఆమె ఈ ఫోన్లను తీసుకెళ్లారని తెలిసింది.
12/ 13
ఈడీ ఆఫీసుకి వెళ్లేముందు కవిత... తన లాయర్లను సంప్రదించారు. ఆ తర్వాత ఈడీ ఆఫీసుకి వెళ్లారు. ఐతే.. ఆమె ఫోన్లను నాశనం చేయలేదని తెలిపేందుకే మీడియా ముందు ప్రదర్శన చేశారని తెలుస్తోంది.
13/ 13
ఈ కేసులో 36 మంది 170 ఫోన్లను వాడినట్లు ఆరోపణలున్నాయి. వాటిలో 17 ఫోన్లను ఈడీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.