ఇండియాలో నిన్న 19,556 కేసులు మాత్రమే వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కి చేరింది. అలాగే... నిన్న 301 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,46,111కి చేరింది. ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. నిన్న ఇండియాలో 30,376 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 96,36,487కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు 95.6 శాతానికి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 2,92,518గా ఉన్నాయి. ఇండియాలో నిన్న 10,72,228 టెస్టులు జరిగాయి. మొత్తం టెస్టుల సంఖ్య 16,31,70,557కి చేరింది.