తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన ''సిస్టర్ ఫర్ ఛేంజ్..గిఫ్ట్ ఏ హెల్మెట్" కార్యక్రమానికి బ్రిటీష్ దౌత్యవేత్తలు మద్దతు తెలిపారు.
2/ 6
బుధవారం నిజామాబాద్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన "సిస్టర్ ఫర్ చేంజ్" అవగాహన ర్యాలీని బ్రిటిష్ దౌత్యవేత్తలు ప్రారంభించారు.
3/ 6
బ్రిటీష్ హై కమిషన్ తెలంగాణ, ఏపి రాష్ట్రాల డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, రాజకీయ మీడియా విభాగాధిపతి కిరణ్ డ్రేక్, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
4/ 6
తెలంగాణ జాగృతి మహిళా నాయకులు బ్రిటీష్ దౌత్యవేత్తలకు రాఖీలు కట్టారు. యువకులకు హెల్మెట్లు బహూకరించారు.
5/ 6
బ్రిటిష్ దౌత్యవేత్తలకు రాఖీలు కడుతున్న తెలంగాణ జాగృతి మహిళలు
6/ 6
ప్రారంభ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజి గౌడ్ హాజరయ్యారు.