Hyderabad: హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్.. మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే..
Hyderabad: హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్.. మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే..
Wine Shops Close: బోనాల పండగ వేళ మద్యం ప్రియులకు మింగుడపడని వార్త ఇది. బోనాల వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో వైన్ షాప్‌లు మూతపడనున్నాయి. ఎన్ని రోజులు మూసేస్తారు? మళ్లీ ఎప్పుడు తెరచుకుంటాయో తెలుసా..?
హైదరాబాద్‌లో బోనాల సందడి నెలకొంది. ఆదివారం లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమయింది. ఐతే బోనాల పండగ నేపథ్యంలో హైదరాబాద్‌లో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాని పోలీసులు ఆదేశాలు జారీచేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 5
ఈ మేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం, కల్లు విక్రయాలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
వైన్ షాపులు శనివారం రాత్రి 11 గంటల వరకు తెరిచే ఉంటాయి. ఆ తర్వాత మళ్లీ మంగళవారమే తెరచుకుంటాయి. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులు ముందుగానే అప్రమత్తమై.. పండగకు సరిపడా లిక్కర్‌ను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
రేపటి నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనుండడంతో.. ఇవాళ హైదరాబాద్ పరిధిలోని మద్యం షాపులకు గిరాకీ పెరిగింది. అన్ని దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)