Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో కలిసి బాలీవుడ్ నటి పాదయాత్ర.. ఫొటోలు వైరల్
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో కలిసి బాలీవుడ్ నటి పాదయాత్ర.. ఫొటోలు వైరల్
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో సినీ హీరోయిన్లు సందడి చేస్తున్నారు. మొన్న పూనమ్ కౌర్ రాహుల్ పాదయాత్రలో పాల్గొనగా.. ఇవాళ ప్రముఖ బాలీవుడ్ నటి పూజా భట్ కూడా రాహుల్‌తో కలిసి నడిచారు.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బాలీవుడ్ నటి పూజా భట్ సందడి చేశారు. ఇవాళ ఉదయం ఆమె రాహుల్‌తో కలిసి నడిచారు.
2/ 7
రాహుల్ గాంధీని కలిసి సంఘీభావం ప్రకటించిన పూజా భట్.. ఆయనతో కలిసి కొంత దూరం వరకు భారత్ జోడో పాదయాత్రలో పాల్గొన్నారు.
3/ 7
ఒకే ఫ్రేమ్‌లో రాహల్ గాంధీ, సినీ నటి పూజా భట్ కనిపించడంతో వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
4/ 7
హైదరాబాద్‌లో రెండో రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీయాన్ ఐడియాలజీ సెంటర్ వద్ద ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర.. మదీనగూడ వరకు సాగింది.
5/ 7
మదీనగూడ వల్ల రాహుల్ గాంధీ పాదయాత్రకు విరామం ఇచ్చారు. మళ్లీ సాయంత్రం 4 గంటలకు BHEL బస్ స్టాండ్ నుంచి మళ్లీ యాత్ర ప్రారంభమవుతుంది.
6/ 7
సాయంత్రం 7 గంటల సమయంలో ముత్తింగి పాదయాత్రకు విరామం ఇస్తారు. అక్కడే కార్నర్ మీటింగ్ ఉంటుంది. రాత్రికి రుద్రారంలోని గణేష్ మందిర్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు.
7/ 7
హైదరాబాద్‌లో భారత్ జోడో యాత్రకు భారీగా స్పందన వస్తోంది. జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో నగర రోడ్లు రద్దీగా మారాయి. ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.