బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు..ఈనేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆ జిల్లా బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. కలెక్టరేట్ ప్రధాన గేటు ను తోసుకుని లోపలికి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అయినా బిజేవైఎం కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతో విద్యార్థులు మరింత రెచ్చిపోయారు. కాగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువకులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, నోటిఫికేషన్ లు వేస్తామంటూ ప్రభుత్వం పూటకో మాట మారుస్తుందన్నారు..