Yogi Adityanath: పాతబస్తీలో యూపీ సీఎం యోగి.. భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు
Yogi Adityanath: పాతబస్తీలో యూపీ సీఎం యోగి.. భాగ్యలక్ష్మీ ఆలయంలో ప్రత్యేక పూజలు
UP CM Yogi Adityanath Visits Charminar Bhagyalaxmi Temple: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ఆయన స్వయంగా హారతి ఇచ్చారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఆదివారం ఉదయం పాతబస్తీలో పర్యటరించారు. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. (Image:ANI)
2/ 5
తెలంగాణ బీజేపీ నేతలతో పాటు భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లిన ఆయన.. స్వయంగా అమ్మవారికి హారతి ఇచ్చారు. అనంతరం ఆలయ అర్చకులు యూపీ సీఎంకు భాగ్యలక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.
3/ 5
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు యోగి ఆదిత్యనాథ్ వెంట ఉన్నారు.
4/ 5
పాతబస్తీలో యోగి పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కేంద్ర బలగాలను కూడా మోహరించారు.
5/ 5
చార్మినార్ వద్ద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర తెలంగాణ బీజేపీ నేతలు