పులుల ఆవాసమే కాకుండా వన్య ప్రాణాలతోపాటు అరుదైన పక్షులకు నివాసంగా మారిన ఈ అడవీ ప్రాంతంలో అటవీ శాఖ రెండవసారి ఈ బర్డ్ద్ వాక్ ను నిర్వహిస్తోంది. అయితే ఇక్కడి అడవుల్లో ఉన్న పక్షి జాతులను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పడంతోపాటు పక్షి జాతులపై అధ్యయనం చేయడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అటవీ శాఖ.
అటవీ శాఖ దానికి సంబంధించిన డాక్యూమెంటరీని రూపొందించి సామాజిక మాద్యమంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. కాగా పక్షుల సంరక్షణ ప్రాముఖ్యతను వివరించడంతోపాటు కొత్త పక్షుల గుర్తింపు, అధ్యయనం కోసం నిర్వహిస్తున్న ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ లో భాగంగా పక్షుల ఆవాసాలను చూడవచ్చని బెజ్జూరు అటవీ రేంజ్ అధికారి పి. దయాకర్ తెలిపారు.
అవసరం అయిన చోట ప్రకృతి ప్రేమికులను జీపులో తీసుకువెలతమని అన్నారు. ట్రెక్కింగ్ చేస్తూ రోజంతా అడవుల్లో తిరిగుతూ రకరకాల పక్షులను చూడవచ్చని అన్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాల నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారని తెలిపారు.