కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవమి వేడుకల కోసం భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్ధీపాలతో అలంకరించి... భక్తుల కోసం చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు తలంబ్రాలను పంపిణీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.