ఇక తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో బీర్ల అమ్మకాలు జోరుగా జరిగాయి. కేవలం ఈ ఏడాది మార్చి నుంచి మే 15 నాటికి 6702 కోట్ల రూపాయల బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాది మే నెలతో పోలిస్తే ఈ సంవత్సరం బీర్ల అమ్మకాలు 90శాతం పెరిగినట్లుగా ఎక్సైజ్‌శాఖ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కడా కనిపించకపోవడం, మరోవైపు ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. మార్చి నుంచి మే 15 వరు తెలంగాణ వ్యాప్తంగా 10.64కోట్ల లీటర్ల బీరును తాగేశారు మద్యం ప్రియులు. బీర్ల అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. 2.38కోట్ల లీటర్లను తాగేశారు మందుబాబులు. ఆ తర్వాత 1.15 కోట్ల లీటర్లతో వరంగల్ రెండో స్థానంలో నిలిచింది. (ప్రతీకాత్మక చిత్రం)