BATHUKAMMA 2020 TRS EX MP KAVITHA GIVES CLARITY ON BATHUKAMMA CELEBRATIONS SK
Bathukamma 2020: బతుకమ్మ పండుగపై కవిత క్లారిటీ.. తేదీల ప్రకటన
బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే ఈ పూలపండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఆడపడచులు ఎంతో ఘనంగా జరుపుకునే తీరొక్క పండక్కి ఈసారి తిప్పలొచ్చాయి. పండగను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది.
బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే ఈ పూలపండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఆడపడచులు ఎంతో ఘనంగా జరుపుకునే తీరొక్క పండక్కి ఈసారి తిప్పలొచ్చాయి. పండగను ఎప్పుడు జరుపుకోవాలన్న దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది.
2/ 8
భాద్రపద మాసం బహుళ అమావాస్య నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) వరకు రోజుకో రూపంతో, ఆడపడచుల ఆటపాటలతో బతుకమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తోంది.
3/ 8
ఐతే ఈసారి ఆశ్వీయుజ మాసం అధికంగా రావడంతో బతుకమ్మ వేడుకలను ఎప్పుడు జరపాలన్న దానిపై క్లారిటీ కొరవడింది.
4/ 8
అధికమాసంలో ఎలాంటి శుభకార్యాలూ చేయకూడదని సనాతన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆధ్యాత్మిక సాధనలకు మాత్రం అభ్యంతరం లేదు. ఈ నెలలో పూజలు, దానాలు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదని పెద్దలు చెప్తారు. కానీ పండుగలు, శుభకార్యాలు చేయడంపై మాత్రం నిషేధం ఉంటుంది.
5/ 8
అధికమాసంలో వచ్చే పండుగలను ఆ తర్వాత వచ్చే నిజ మాసంలోనే జరుపుకుంటారు. ఒక్కరోజు పండుగైతే నిజమాసంలో చేసుకునే వీలుంది. కానీ బతుకమ్మ పండుగ రెండు నెలలతో ముడిపడి ఉంది. ఈ క్రమంలో బతుకమ్మ వేడుకలపై పంచాంగకర్తలు, వేదపండితులు స్పష్టత నిచ్చారు.
6/ 8
భాద్రపద బహుళ అమావాస్య (సెప్టెంబర్ 17) నుంచి కాకుండా.. అధిక ఆశ్వీయుజ బహుళ అమావాస్య (అక్టోబర్ 16) నుంచి బతుకమ్మ ఉత్సవాలు చేసుకోవాలని పండితులు సూచించారు.
7/ 8
పండితుల సూచన మేరకు ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 24 వరకు నిర్వహించుకోవాలని మాజీ ఎంపీ కవిత కూడా ట్వీట్ చేశారు. చాలా మంది మెసేజ్లు చేస్తున్నందున ఈ క్లారిటీ ఇస్తున్నట్లు తెలిపారు.
8/ 8
ఇక బొడ్డెమ్మ పండుగను మాత్రం భాద్రపద బహుళ సప్తమి (సెప్టెంబర్ 9) నుంచి అమావాస్య వరకు (సెప్టెంబరు 17) వరకు జరుపుకోవచ్చు. పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేసి పూలతో అలంకరించి ఆటపాటలతో మహిళలు సందడి చేస్తారు.