Bathukamma: సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీష్ రావు సందడి

సిద్దిపేట కోమటి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా పాల్గొని సందడి చేశారు. ప్రపంచమంతా మన ఆడపడచులు బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు హరీష్ రావు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు ఆయన చెప్పారు.