Bandi Sanjay: "నాకు నమ్మకం లేదు..నేను రాను"..సిట్ కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: "నాకు నమ్మకం లేదు..నేను రాను"..సిట్ కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ ఘటనపై సిట్ (Special Inevstigation Team) బృందం ప్రత్యేక దర్యాప్తు చేస్తుంది. అయితే పేపర్ లీక్ పై టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సిట్ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో బండి సంజయ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది.ఈ నేపథ్యంలో బండి సంజయ్ సిట్ విచారణపై ఉత్కంఠ నెలకొనగా..తాజాగా సిట్ కు ఆయన లేఖ రాశారు.
Bandi Sanjay: TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ ఘటనపై సిట్ (Special Inevstigation Team) బృందం ప్రత్యేక దర్యాప్తు చేస్తుంది. అయితే పేపర్ లీక్ పై టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సిట్ సీరియస్ గా తీసుకుంది.
2/ 7
ఈ క్రమంలో బండి సంజయ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈనెల 24న విచారణకు రావాలని..చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సిట్ విచారణపై ఉత్కంఠ నెలకొనగా..తాజాగా సిట్ కు ఆయన లేఖ రాశారు.
3/ 7
తనకు సిట్ పై నమ్మకం లేదని..సిట్ ను తాను విశ్వసించడం లేదని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. తన దగ్గరున్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదలచుకోలేదన్నారు.
4/ 7
పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమకు నమ్మకం ఉన్న సంస్థలకే సమాచారం ఇస్తామని అన్నారు.
5/ 7
ఇక సిట్ నోటీసులు తనకు అందలేదని..మీడియాలో వచ్చిన సమాచారం మేరకే స్పందిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు.
6/ 7
తాను పార్లమెంట్ సభ్యునిగా సభకు హాజరు కావాల్సి ఉందని..కాబట్టి సిట్ విచారణకు హాజరు కావడం లేదన్నారు.
7/ 7
అయితే తన అవసరం ఉందనుకుంటే సిట్ అధికారులు మరో తేదిని ఖరారు చేయాలనీ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.