తెలంగాణ అసెంబ్లీలో ముగిసిన బీఏసీ సమావేశం..6న బడ్జెట్ సహా షెడ్యూల్ ఇలా..
తెలంగాణ అసెంబ్లీలో ముగిసిన బీఏసీ సమావేశం..6న బడ్జెట్ సహా షెడ్యూల్ ఇలా..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క కోరారు. ఇక ఈనెల 6న తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక షెడ్యూల్ ఇలా..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన బీఏసీ సమావేశం ముగిసింది.
2/ 10
ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క కోరారు. ఇక ఈనెల 6న తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ బడ్జెట్ పై 8న చర్చ జరగనుంది.
3/ 10
అలాగే ఈనెల 8న మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. తదుపరి షెడ్యూల్ గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉండనుంది.
4/ 10
ఈ సమావేశంలో గవర్నర్ తమిళిసై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కాళోజి మాటలైన పుట్టుక నీది..చావు నీది కానీ బతుకంతా దేశానికి అంటూ తమిళిసై తన ప్రసంగం ప్రారంభించారు.
5/ 10
'తెలంగాణ అభివృద్ధి దేశానికి రోల్ మోడల్. సీఎం, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో ఎన్నో విజయాలు సాధించింది.
6/ 10
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ 1గా ఉంది. తలసరి ఆదాయం రూ.3,17115కి పెరిగింది. మూడున్నర ఏళ్లలోనే కాళేశ్వరం పూర్తయింది. లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం కోసం ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది.
7/ 10
గవర్నర్ ప్రసంగం ముందు ప్రభుత్వం పంపిన కాపీని మాత్రమే చదువుతారా లేక తన సొంత ప్రసంగాన్ని వినిపిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. కానీ గవర్నర్ కేవలం ప్రభుత్వం ఇచ్చిన కాపీని మాత్రమే చదివి వినిపించారు. గవర్నర్ ప్రసంగం కేంద్రం ప్రస్తావన లేకుండా ముగిసింది.
8/ 10
ఫిబ్రవరి 6న అసెంబ్లీలో 2023-34 వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు (Finance Minister Harish Rao) ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 6నఉదయం 11 గంటలకు శాసనసభలో మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
9/ 10
ఇక 7న బడ్జెట్ ను అధ్యయనం చేయడానికి సెలవు ఇస్తారు.
10/ 10
ఇక తెలంగాణ బడ్జెట్ (Telangana Budget) రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్ధిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం 19-20 శాతం వృద్ధి నమోదు చేసినందున ఈమేర ఆర్ధిక వర్గాలు అంచనా వేశాయి.