Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైళ్లపై లాక్‌డౌన్ ఎఫెక్ట్.. మెట్రో సర్వీస్ లు బంద్..!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై కరోనా, నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రభావం విపరీతంగా పడింది. అసలే కరోనా సెకండ్ వేవ్ తో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించడానికి ఇష్టపడడం లేదు. దీంతో నష్టాలను మూట కట్టుకుంది. లాక్‌డౌన్ అయ్యే వరకు సర్వీసులు పూర్తిగా రద్దు చేసే యోచనలో హెఎచ్‌ఎమ్‌ఆర్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.