Telangana Rythu Bandhu: ఈ నెల 15 నుంచి రైతులకు రైతుబంధు సాయం.. కొత్తగా మరో 2.22 లక్షల మందికి..

Telangana Rythu Bandhu: తెలంగాణలో రైతుబంధు సాయం కింద ఎకరాకు ఏడాదికి రూ. 10 వేలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం అందనుంది. ఈ సారి కొత్తగా మరో 2.22 లక్షల మంది లబ్దిపొందనున్నారని రెవెన్యూశాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.