ఈ నెల 5న ప్రధాన మంత్రి ఈ విగ్రాహాన్ని ఆవిషర్కించనున్నారు. ప్రపంచంలో రెండో అతి పెద్ద స్టాచ్యూగా నిలవబోతున్న ఈ విగ్రహాం ఏర్పాటు నుంచి డిజైన్ వరకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో ఏర్పాటు చేసిన విగ్రహం, రామానుజాచార్యను కూర్చున్న స్థితిలో రెండవ ఎత్తైనది ఇది దీంతోపాటు ఆయన పుట్టి 1,000 సంవత్సరాల అవుతున్న నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించారు.
ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు 1,000 కోట్లు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, తగరం వంటి ఐదు లోహాలతో చేసిన 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని 2017లోనే ప్రతిష్టించారు, అయితే మిగతా నిర్మాణాల పనులు పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. కూర్చున్న స్థితిలో ఉన్న రామానుజాచార్యుల విగ్రహం భద్రవేది అని పిలువబడే మూడు అంతస్తుల 54-అడుగుల నిర్మాణంపై నిర్మించిన భారీ కమలంపై ఉంచబడింది.
వైష్ణవ సన్యాసి రామానుజాచార్యుల 1000వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని ప్రపంచానికి అంకితం చేయనున్నారు. 11వ శతాబ్దపులో రామానుజాచార్యుల జీవించి ఉన్నసంవత్సరాల సంఖ్యను సూచించే విధంగా 54 అంగుళాల, 120 కిలోల బంగారు విగ్రహాన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు. దాదాపు 500 మంది కార్మికులు వెదురు, తాటి కొమ్మలతో 144 షెడ్లను నిర్మించారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 5,000 మంది ఋత్విక్కులు, వేద పండితుల వేదమంత్రలతో ఈ వేడకు అన్ని సిద్దం చేస్తోన్నారు.