TS Inter Results: కరోనా సెకెండ్ వేవ్.. కఠిన కర్ప్యూ కారణంగా గత మార్చిలో వాయిదా పడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు నిర్వహించింది తెలంగాణ విద్యాశాఖ. ఈ పరీక్షలకు దాదాపు 4.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
మరి కొన్ని గంటల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ పరీక్షా పత్రాల వాల్యుయేషన్ ఇప్పటికే పూర్తయింది. మార్కుల టేబులేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో ఫలితాలను విడుదల చేసేందుకు విద్యా శాఖ సిద్ధమైంది. ముందుగా ప్రకటించినట్లుగానే ఈరోజు ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు.
Step 1: విద్యార్థులు మొదటగా ఇంటర్ బోర్డ్ అధికారిక tsbie.cgg.gov.inను ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం ‘TS Inter First Year Results 2021’ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి Step 3: దీంతో లాగిన్ పేజీ అవుతుంది. ఆ పేజీలో హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, తదితర సూచించిన వివరాలను నమోదు చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)
3) అనంతరం ‘సబ్మిట్’ పై క్లిక్ చేయాలి 4) దీంతో స్క్రీన్ పై సబ్జెక్టుల వారీగా మీ రిజల్ట్ కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం మీ రిజల్ట్స్ షీట్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. మీ మార్కులు తక్కువగా వచ్చాయని మీరు భావిస్తే రీ కౌంటింగ్ తో పాటు రీ వాల్యుయేషన్ కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇంటర్ బోర్డు మీకు కల్పిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
విద్యార్థులు ఒక వేళ ఫెయిల్ అయితే కనీస మార్కులతో పాస్ చేయాలని ఆయా వర్గాల నుంచి వినతులు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులు నష్టపోకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మొదట కరోనా పరిస్థితుల దృష్ట్యా గతేడాది పరీక్షలు లేకుండానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేసిన ప్రభుత్వం మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)