1. మీకు రేషన్ కార్డు ఉందా? ప్రతీ నెల రేషన్ తీసుకుంటున్నారా? ఫిబ్రవరిలో రేషన్ షాప్‌కి వెళ్లే ముందు కొత్త రూల్స్ తెలుసుకోండి. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పి రేషన్ షాపులో సరుకులు తీసుకునే పద్దతి అమల్లోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. తెలంగాణలోని మొత్తం 87,44,251 రేషన్ కార్డు హోల్డర్స్ ఉండగా వారిలో 5,80,680 కార్డులు హైదరాబాద్‌లో, 5,24,656 కార్డులు రంగారెడ్డి జిల్లాలో, 4,94,881 కార్డులు మేడ్చల్ మల్కార్జిరి జిల్లాలో, 2,34,940 కార్డులు వికారాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. ఈ రేషన్ కార్డ్ హోల్డర్లు తమ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ చెప్పి రేషన్ షాపులో సరుకులు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. రేషన్ షాపులో సరుకుల ఇవ్వడానికి ఐరిస్ విధానానికే మొదటి ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మండ్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఐరిస్ విధానంలో సమస్యలు ఉంటేనే మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా సరుకులు ఇస్తామన్నారు. కాబట్టి రేషన్ కార్డు హోల్డర్లు తమ మొబైల్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌కు లింక్ చేయడానికి కంగారుపడాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
6. రేషన్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ నెంబర్‌కు ఆధార్ నెంబర్ లింక్ కాకపోతే ఐరిస్ ద్వారా సరుకులు తీసుకోవచ్చు. రేషన్ కార్డులోని కుటుంబసభ్యుల్లో ఎవరైనా ఒకరు ఐరిస్ ద్వారా సరుకులు తీసుకోవచ్చు. లేదా ఒకరిది ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నా చాలు. ప్రజల్లో గందరగోళం నెలకొనడంతో రేషన్ షాపులో సరుకుల పంపిణీ గడువును ఫిబ్రవరి 22 వరకు పొడిగించింది ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
8. కరోనా వైరస్ మహమ్మారి లాక్డౌన్ సమయంలో పేదలకు సరుకులు అందజేసేందుకు రేషన్ షాపుల పాత్ర కీలకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అంటే రేషన్ కార్డు హోల్డర్లు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఎవరైనా రేషన్ కార్డుకు అప్లై చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి ప్రత్యేక పథకాలు ఉన్నాయి. బిలో పావర్టీ లైన్-BPL, నాన్ బీపీఎల్ పేరుతో రెండు రకాలుగా రేషన్ కార్డులు ఉంటాయి. 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా రేషన్ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు. ఒక రాష్ట్రంలో మాత్రమే రేషన్ కార్డుకు అప్లై చేయాలి. రేషన్ కార్డులో యజమాని పేరుతో పాటు కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
10. తెలంగాణలో రేషన్ కార్డుకు అప్లై చేయాలంటే మీసేవ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పేరు, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబ సభ్యుల వివరాలతో ఫామ్ పూర్తి చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి మీసేవ సెంటర్లో దరఖాస్తు ఫామ్ ఇవ్వాలి. రెసిడెన్స్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి. (ప్రతీకాత్మక చిత్రం)