గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కలవరపాటు కలిగిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర గ్రామంలో అతి తక్కువగా ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి ఏడు ప్రాంతాలు ఉన్నాయంటే జిల్లాలో చలి తీవ్రత ఎంతగా ఉందో తెలుస్తోంది.
పలు మండలాల్లో పది డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జిల్లా మొత్తం చలితో గజగజ వణికిపోతోంది. దీనికి తోడు పొగమంచు కూడా ఆవహిస్తుండటంతో వాహన దారులు రాకపోకల సందర్భంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వృద్దులు, పిల్లలు చలి ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాధుల బారిన కూడా పడుతున్నారు.
చలి నుండి రక్షణ పొందేందుకు చలి మంటలు కూడా కాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ చలి తీవ్ర ప్రభావంగా చూపుతోంది. అల్పపీడన ప్రభావంతో చలికి తోడు చల్లటి గాలులు కూడా వీస్తుండటంతో చలి ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.