అటు ఆర్టీసి కూడా జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. దీంతో పాటు ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుండి ఉట్నూరు వైపు వెళ్ళే అన్ని ఆర్టీసి బస్సులను కేస్లాపూర్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి పలుమార్లు కేస్లాపూర్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
అధికారులకు అవసరమైన సూచనలు కూడా చేశారు.శనివారం రాత్రి నుంచి నాగోబా జాతరకు ఈ నెల 22వ తేదిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రానుండగా, జాతరలో భాగంగా ఈ నెల 24వ తేదీన నిర్వహించే దర్భార్ కు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హజరుకానున్నారు.