ఈ పాఠశాలల ప్రారంభోత్సవం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అట్టహాసంగా జరిగింది. అధికారులు, ప్రజాపతినిధులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కాగా నిర్మల్ జిల్లాలోని ఎల్లపల్లిలో మన ఊరు - మనబడి కార్యక్రమం కింద మొదటి విడతలో ఎంపికైన మోడల్ పాఠశాల అయిన మండల ప్రాథమికోన్నత పాఠశాల, ఎల్లపల్లి పాఠశాలను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
ఇందులో నుండి మండలానికి రెండు చొప్పున ఎంపికైన 38 మోడల్ పాఠశాలలో ముఖ్యమంత్రి నిర్ణయించిన విధంగా ఈరోజున మొదటగా నిర్మల్ జిల్లాలోని ఎల్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఈ వేదిక నుండి ప్రారంభం చేయడం జరిగిందని తెలియజేశారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈ పాఠశాలలో మన ఊరు -మన బడి పథకం కింద మొత్తం 12 రకాలైన మౌలిక వసతులు కల్పించామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, సెక్టోరల్ అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, గ్రామ సర్పంచ్ అల్లోల రవీందర్ రెడ్డి , పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఎం శంకర్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్ రెడ్డి , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అటు ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పలు పాఠశాలలను ప్రారంభించారు.