ఆమె కు మద్దతుగా ఆదివాసి హక్కుల పోరాట సమితి(తుడుందెబ్బ), బిజెపి నాయకులు బైఠాయించి
ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడే ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకారులవైపు వచ్చి పెద్దపెట్టు నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోస్వతంత్ర్య అభ్యర్థి అయిన టిఆర్ఎస్ జడ్పిటిసి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన తరఫున ఎవరో విత్ డ్రా ఫాం అందజేశారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అవసరమైతే న్యాయస్థానానికి కూడా వెళతానని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికి అధికారులు వివరాలకు ఎందుకు ప్రకటించడం లేదని నిరసనకు దిగారు. అధికారులు టిఆర్ ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ బిజెపి నేతల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురిని కారాలయం బయాటకు తీసుకువచ్చారు. మళ్ళీ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో స్వతంత్ర్య అభ్యర్థి కూడా ధర్నా కు దిగడం తో ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని టూటౌన్ కి తరలించారు.
చివరకు ఆదిలాబాద్ శాసన మండలి స్థానానికి పోటీలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అధికార టిఆర్ఎస్ తరఫున దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా ఆదివాసి గిరిజన నాయకురాలు పెందూర్ పుష్పారాణి బరిలో ఉన్నారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక ఎన్నిక నాటికి ఎన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.