కేసు పెట్టి, జైలుకు పంపాలని మోడీ అమిత్ షా చేసే కుట్రలు, బెదిరింపులకు రాహుల్ లొంగడని స్పష్టం చేశారు. తీవ్రవాదుల చేతుల్లో దేశం విచ్చినం కాకుండా దేశ ఔన్నత్యం, సమైక్యత, సమగ్రత కోసం ఖలిస్తాన్ ఉగ్రవాదుల తుపాకీ తూట్ల వర్షానికి ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీ రక్తం రాహుల్ లో ప్రవహిస్తున్నదని అన్నారు.