Aasara Pensions: ఇకపై 57 ఏళ్లు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్.. అర్హత వివరాలు ఇవే
Aasara Pensions: ఇకపై 57 ఏళ్లు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్.. అర్హత వివరాలు ఇవే
Aasara Pensions: తెలంగాణలో ఇక నుంచి 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నారు. వృద్ధాప్య పించన్ లబ్ధిదారుడి కనీస వయసు అర్హతను 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీ వచ్చే నెల నుంచి అమలుచేయనున్నట్లు ఆదివారం ఆయన ప్రకటించారు.
తెలంగాణలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికే ఆసరా పెన్షన్లను ఇస్తున్నారు. ఐతే వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారందరికీ పించన్లు ఇస్తారు. సీఎం కేసీఆర్ సూచనలు మేరకు అధికారయంత్రాగం ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా 57 ఏళ్లు నిండిన వారందరికీ రూ.2,116 వృద్ధాప్య పెన్షన్ ఇస్తారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి 57 ఏళ్లు నిండినవారు ఆసరాకు అర్హులు. ఓటర్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా వయసు నిర్ధారిస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
దరఖాస్తుదారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణికి 3 ఎకరాలకు మించి ఉండరాదు. కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2లక్షలు మించి ఉండకూడదు. ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారాలు ఉన్నా పెన్షన్ రాదు.. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతర వృత్తులు, వ్యాపారాల్లో కొనసాగుతున్న వారి సంతానంపై ఆధారపడి ఉన్నవారు ఆసరా పెన్షన్‌కు అనర్హులు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ పొందుతున్నవారు ఆసరా పెన్షన్లు ఇవ్వరు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అంతేకాదు .. తమ పేరిట హెవీ వెహికిల్స్ ఉన్నా, ఐటీ రిటర్నులు దాఖలు చేసినా పెన్షన్ పథకం వర్తంచదు. లబ్ధిదారుల సంతానం ప్రభుత్వ, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండరాదు. 57 ఏళ్లు నిండి, ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు కలిగిన వారికే పెన్షన్ ఇస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
తెలంగాణలో వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు రూ.2,116 పెన్షన్ ఇస్తున్నారు. అదే దివ్యాంగులకు రూ.3,116 ను అందిస్తున్నారు.