తెలంగాణలో జూన్ 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా బడి ఈడు పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచడం వంటి వాటిని చేపడుతున్నారు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు. (ప్రతీకాత్మక చిత్రం).
మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెలాఖరుకల్లా విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు.
ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను ఆయన కోరారు.