భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ నెల 15 వ తేదితో 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా దేశమంతా అజాది అమృత్ మహోత్సవాలను నిర్వహించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామానికి చెందిన జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మల్లికార్జున్ రెడ్డి వినూత్నంగా అలోచించి దేశ భక్తిని చాటుకుంటున్నాడు.