2. అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఇందుకు సంబంధించిన అనుమతులు వస్తాయని మరికొందరు అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా.. మరో వారం, పది రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల అవడం ఖాయమని సమాచారం. అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలతో సంబంధం లేకుండా ప్రిపరేషన్ ను ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3. ఉద్యోగ ఖాళీలను నాలుగు కేటగిరీలుగా విభజించగా.. అందులో అధిక శాతం జిల్లా స్థాయివే ఉన్నాయి. కొత్త జిల్లాలతో పాటు పాత జిల్లాల్లో కూడా కొత్త ఉద్యోగుల అవసరం ఉంది. జిల్లా స్థాయి ఖాళీలతో పాటు ఉద్యోగుల సంఖ్య, సర్వీసు నిబంధనలు, రోస్టర్ తదితరాలపై ఇప్పటికే స్పష్టత వచ్చిన నేపథ్యంలో.. నియామకాలు ముగిసిన వెంటనే కేటాయింపులు జరిగే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అయితే ప్రస్తుతం ఉద్యోగులు ఎక్కువగా అవసరం ఉన్న జూనియర్ అసిస్టెంటు, జూనియర్ పంచాయతీ అధికారి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంటు, జూనియర్ స్టెనో, డ్రైవర్, రికార్డు అసిస్టెంటు, ఆఫీస్ సబార్డినేట్, శానిటరీ వర్కర్, స్వీపర్, వాచ్ మెన్ పోస్టుల వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఈ నేపథ్యంలో ముందుగా గ్రూప్ -4 స్థాయి పోస్టుల ఉద్యోగాలు.. వెంటనే భర్తీ చేసే అవకాశం ఉందని చాలా మంది కోచింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు వీటికి ప్రిపేర్ అవ్వమని సూచిస్తున్నట్టు సమాచారం. అయితే ముందుగా పోలీస్ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది ఎక్కువ మంది నిరుద్యోగులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)