1. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. స్టెనోగ్రాఫర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న కోర్టుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 ఏప్రిల్ 4 చివరి తేదీ. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. పోస్టు ద్వారా, కొరియర్ ద్వారా లేదా నేరుగా అభ్యర్థులు సబ్మిట్ చేసే దరఖాస్తుల్ని స్వీకరించరు. ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జిల్లాలవారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 64 పోస్టులున్నాయి. వీటిలో ఆదిలాబాద్- 3, ఖమ్మం- 1, కరీంనగర్- 7, మహబూబ్‌నగర్- 8, మెదక్- 3, నిజామాబాద్- 4, నల్గొండ- 10, రంగారెడ్డి- 20, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్, హైదరాబాద్- 6, సిటీ కోర్ట్, హైదరాబాద్- 2 పోస్టులున్నాయి. ఆన్లైన్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా ఇక్కడ క్లిక్ చేసి పార్ట్ ఏలో వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయాలి. అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. అభ్యర్థి మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి OTPR ID, పాస్వర్డ్ వస్తాయి. ఈ వివరాలతో లాగిన్ కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. లాగిన్ అయిన తర్వాత పార్ట్ బీ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. విద్యార్హతలు ఎంటర్ చేసి పోస్ట్ పేరు, జిల్లా సెలెక్ట్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. దరఖాస్తు ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)