1. గూగుల్‌కు చెందిన అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫామ్ అయిన యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. ఓ గంట పాటు యూట్యూబ్ పనిచేయలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్లలో ఆందోళన నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. సాధారణంగా యూట్యూబ్ ఎప్పుడూ డౌన్ కాదు. 24 గంటలూ పనిచేస్తూనే ఉంటుంది. కానీ ఏం జరిగిందో ఏమో ఉదయం ఓ గంటపాటు యూట్యూబ్ సేవల్లో అంతరాయం నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. ఒక్కసారిగా యూట్యూబ్ పనిచేయకపోవడంతో యూజర్లు ట్విట్టర్లో తమ ఆందోళన వ్యక్తం చేశారు. యూట్యూబ్ వీడియోలు ప్లే చేయలేకపోతున్నామని ట్వీట్లు చేశారు. ఇలా ఓ గంట సేపు యూట్యూబ్ పనిచేయలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. వెంటనే అప్రమత్తమైన యూట్యూబ్ ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని మొదట ట్వీట్ చేసింది. ఏవైనా అప్డేట్స్ ఉంటే చెప్తామని యూజర్లకు సమాచారం ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. యూట్యూబ్ నిలిచిపోయిన ఓ గంటపాటు #YouTubedown అనే హ్యాష్ ట్యాగ్‌తో 2,00,000 ట్వీట్స్ చేయడం విశేషం. అయితే గంట సమయంలోనే సమస్యను పరిష్కరించింది యూట్యూబ్. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. అన్ని యూట్యూబ్ డివైజ్‌లలో యూట్యూబ్ సమస్యను గుర్తించిన టీమ్ యూట్యూబ్ వెంటనే పరిష్కరించింది. తమ సేవలు మళ్లీ మొదలైనట్టు ట్విట్టర్లో ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో, ఎందుకు యూట్యూబ్ గంటసేపు పనిచేయలేదో యూజర్లకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని యూట్యూబ్ కూడా వెల్లడించలేదు. కానీ సమస్యను పరిష్కరించేసింది. (ప్రతీకాత్మక చిత్రం)