1. సోషల్ మీడియా(Social Media) విస్తృతితో ఎన్ని లాభాలున్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పడు అసలు వార్తలకంటే నకిలీ వార్తలే (Fake News) రాజ్యమేలుతున్నాయి. అంతే కాకుండా.. ఫ్యాన్ వార్లతో సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకొంది. ఫేక్ న్యూస్ కట్టడి, మరోకటి డిస్లైక్ ఫీచర్. (ప్రతీకాత్మక చిత్రం)
2. చాలా వీడియోలు యూట్యూబ్‌లో అప్డేట్ అవుతుంటాయి. నచ్చితే లైక్, నచ్చకుంటే డిస్లైక్ చేస్తుంటాం. అయితే కొందరు డిస్‌లైక్‌లతో దాడులు, వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో డిస్లైక్ కౌంట్‌ను కనిపించకుండా చేయడం ద్వారా క్రియేటర్స్‌కి, వ్యూయర్స్‌కి మధ్య మర్యాదపూర్వక వాతావరణం నెలకొనవచ్చని యూట్యూబ్ ఆశిస్తోంది.
6. ముఖ్యంగా, కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ వల్ల దుష్పరిణామాలు వాటిల్లుతున్నాయంటూ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు వార్తలు, విశ్లేషణలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నకిలీ వార్తలు నిజమేనని నమ్మి చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు.
8. కొందురు కావాలని వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న ఛానెళ్లపై చర్యలు తీసుకుంది యూట్యూబ్. ఇక, యూట్యూబ్ తరహాలోనే ఫేస్బుక్, ట్విట్టర్ సైతం టీకాల గురించి తప్పుడు సమాచారాన్ని పంచుకునే వినియోగదారులను ప్లాట్‌ఫారమ్ నుండి నిషేధిస్తున్నట్లు పేర్కొన్నాయి.