ఈ ఫీచర్ ద్వారా నోట్స్, రిమైండర్లు, ప్రత్యేక టెక్స్ట్‌లను సేవ్ చేసుకొనే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ డివైజ్‌లకు ఇప్పటికే ఈ అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫీచర్ వినియోగిస్తున్న వారికి మరో గుడ్‌న్యూస్ ఉంది. అదేంటంటే.. ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేయకుండానే ఇతరుల నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
* కాంటాక్ట్ సేవ్ చేయకుండానే వాట్సాప్ మెసేజ్
వాట్సాప్ యూజర్లు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఇతరుల ఫోన్ నంబర్ సేవ్ చేయకుండానే మెసేజ్ పంపవచ్చు. ఎవరైనా తమ ఫోన్ నంబర్ ఇచ్చినప్పుడు.. నంబర్ సేవ్ చేయడం మర్చిపోయినా.. లేదా చేయకూడదనుకున్నా.. ఇబ్బంది లేదు. కాంటాక్ట్ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్ పంపవచ్చు. అయితే ఇలా చేయడానికి లేటెస్ట్ అప్డేట్ మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ అవసరం. నంబర్ సేవ్ చేయకుండా ఎలా చేయాలంటే.. (ప్రతీకాత్మక చిత్రం)
* మెసేజ్ యువర్సెల్ఫ్ ఎలా పని చేస్తుంది?
మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ కోసం వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్డేట్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత.. వినియోగదారులకు వారి యూజర్‌నేమ్‌తో ప్రత్యేక చాట్ విండో కనిపిస్తుంది. యూజర్ నేమ్ పక్కనే (You) అని కూడా ఉంటుంది. ఆ చాట్ విండోలో అన్ని రకాల మెసేజ్‌లు సెండ్ చేసే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
నోట్స్, షాపింగ్ లిస్ట్, బుక్మార్క్లు, రిమైండర్లు, లింక్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు వంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి చాట్ విండోని ఉపయోగించుకోవచ్చు. ఏ డివైజ్‌లో మెసేజ్ చేసినా.. లింక్ అయిన ప్రతి డివైజ్‌లో అప్డేట్ అవుతుంది. సాధారణ మెసేజ్‌ల తరహాలోనే వీటికి కూడా ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. ప్రత్యేక చాట్ విండోలో సెండ్ చేసిన అన్ని వివరాలకు పూర్తి భద్రత ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)