1. Realme X2 Pro: రియల్మీ నుంచి రిలీజైన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఇది. రియల్మీ ఎక్స్2 ప్రో ప్రత్యేకతలు చూస్తే 100% ఛార్జింగ్ కేవలం 33 నిమిషాల్లో పూర్తవడం ఓ విశేషం. స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్, 50w SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ కెమెరా, సూపర్ అమొలెడ్ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్మీ ఎక్స్2 ప్రో 8జీబీ+128జీబీ ధర రూ.29,999 కాగా, 12జీబీ+256జీబీ ధర రూ.33,999. (image: Realme)
2. OnePlus 7T: వన్‌ప్లస్ 7టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. 6.55 అంగుళాల భారీ ఫుల్ హెచ్డీ+ అమొలైడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 855+ ప్రాసెసర్, 48+16+12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. వన్‌ప్లస్ 7టీ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.34,999.
3. Redmi K20 Pro: వన్‌ప్లస్‌కు పోటీగా షావోమీ రెడ్మీ కే20 ప్రో, రెడ్మీ కే20 ఫోన్లను రిలీజ్ చేసింది. పాప్-అప్ సెల్ఫీ కెమెరా, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పనోరమా సెల్ఫీ, డార్క్ మోడ్, అమొలెడ్ డిస్ప్లే, 91.9% స్క్రీన్-టు-బాడీ రేషియో లాంటి ఫీచర్లున్నాయి. రెడ్మీ కే20 ప్రో 6జీబీ+128జీబీ ధర రూ.24,999 కాగా 8జీబీ+256జీబీ ధర రూ.27,999.
4. Asus 6Z: ఏసుస్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. ఏసుస్ 6జెడ్ స్మార్ట్‌ఫోన్‌లో 48+13 మెగాపిక్సెల్ మోటరైజ్డ్ రొటేటింగ్ కెమెరా ఉంటుంది. ఇదే కెమెరా రియర్, సెల్ఫీ కెమెరాగా పనిచేయడం విశేషం. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లల్లో ఉన్నట్టు ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. దాని బదులు వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. ఇక 5,000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీ క్విక్ ఛార్జ్ 4.0 టెక్నాలజీని సపోర్ట్ చేయడం మరో విశేషం. ఏసుస్ 6జెడ్ 6జీబీ+64జీబీ ధర రూ.27,999.
5. Oppo Reno 10x Zoom: 'ఒప్పో రెనో' 10x జూమ్ 6.6 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంటుంది. హిడెన్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ 2.0 ఉండటం మరో ప్రత్యేకత. రెనో 10X ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. రెనోలోని 16 మెగాపిక్సెల్ ఏఐ బ్యూటీ కెమెరాతో సెల్ఫీలు అద్భుతంగా వస్తాయి. అద్భుతమైన నైట్ మోడ్ క్లారిటీ, పర్ఫెక్ట్ సెల్ఫీ, సూపర్ టెలిఫోటోతో వైడ్ యాంగిల్ కెమెరా లెన్సెస్... ఇలా ఒప్పో రెనో ప్రత్యేకతలెన్నో. 'ఒప్పో రెనో' 10x జూమ్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.39,900.
8. Oppo Reno2: ఒప్పో నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో రెనో 2. గేమ్ బూస్ట్ 3.0 మోడ్, గేమ్ స్పేస్, 3.5 ఎంఎం జాక్, ఇన్-డిస్ప్లే పింగర్‌ప్రింట్ సెన్సార్, టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, VOOC 3.0 ఫ్లాష్ ఛార్జింగ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్, 48+13+8+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం విశేషం. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.36,900.
9. Samsung Galaxy A70s: సాంసంగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4,500 బ్యాటరీ, 64+8+5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.30,999.