Vivo Z1x: రియల్మీ, షావోమీ, సాంసంగ్ స్మార్ట్ఫోన్లకు పోటీగా వివో జెడ్1ఎక్స్ రిలీజ్ చేసింది వివో. వాటర్ డ్రాప్ నాచ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, టైప్ సీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 6.38 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 48+8+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 6జీబీ+64జీబీ ధర రూ.15,990 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.17,990.