వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ (OnePlus Nord CE 5G): ఈ ఏడాది విడుదలైన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ రూ.25,000 సెగ్మెంట్ లో చక్కటి స్పెక్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల ఫుల్హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ (Qualcomm Snapdragon 750G) చిప్సెట్తో పనిచేస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4,500ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే దీని ధర ఇండియాలో రూ.24,999 నుంచి ప్రారంభమవుతుంది.
ఐకూ జెడ్3 5జీ (iQoo Z3 5G): రూ. 20,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఐకూ జెడ్3 5జీ బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇది 6.58-అంగుళాల ఫుల్హెచ్డీ+ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ Adreno 620 GPU, ఆక్టా-కోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 768G ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుకవైపు ఉన్న ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 19,999 ప్రారంభమవుతుంది.
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూషన్ (Motorola Edge 20 Fusion): మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూషన్ అనేది 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6.7-అంగుళాల ఫుల్హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 30W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్లతో వస్తుంది. కంపెనీ బ్లోట్‌వేర్ ఫ్రీ ఆండ్రాయిడ్ 11ని ఇందులో అందించారు. అయితే దీని లో-లైట్ కెమెరా పనితీరు పేలవంగా ఉంటుందనేది కొనే ముందే తెలుసుకోవాలి. భారతదేశంలో దీని ధర రూ. 21,499 నుంచి ప్రారంభమవుతుంది.
షావోమీ ఎంఐ 10ఐ 5జీ (Xiaomi Mi 10i 5G): షావోమీ ఎంఐ 10ఐ 5జీ.. 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 6.67-అంగుళాల ఫుల్హెచ్డీ+ డిస్ప్లే, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 4,820ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫ్లాగ్షిప్ ఫీచర్లతో వస్తుంది. దీని ధర రూ.21,999 నుంచి మొదలవుతుంది.