Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్... ప్రత్యేకతలు ఇవే
Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్... ప్రత్యేకతలు ఇవే
Xiaomi Redmi Note 7S | షావోమీ నుంచి ఇటీవల రిలీజైన మరో స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 48 మెగాపిక్సెల్ కెమెరాతో రావడం విశేషం. రెడ్మీ నోట్ 7ఎస్ మరిన్ని స్పెషాలిటీస్ తెలుసుకోండి.
1. రెడ్మీ 7 సిరీస్‌లో మరో ఫోన్ రిలీజ్ చేసింది షావోమీ. ఇప్పటికే రెడ్మీ 7, రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు నాలుగో ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ తీసుకొచ్చింది. (Image: Tech2)
2/ 7
2. రెడ్మీ నోట్ 7 లాగానే రెడ్మీ నోట్ 7ఎస్‌లో ఆకట్టుకునే ఫీచర్లున్నాయి. 48 మెగాపిక్సెల్ కెమెరాతో ఈ ఫోన్ ప్రత్యేకత. ఇక ఫోన్ ముందు, వెనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉండటం విశేషం. (Image: Tech2)
3/ 7
3. రెడ్మీ నోట్ 7ఎస్‌లో టైప్ సీ పోర్ట్ మరో ప్రత్యేకత. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (Image: Flipkart)
4/ 7
4. రెడ్మీ నోట్ 7ఎస్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉండటం విశేషం. (Image: Tech2)