Xiaomi New Products: ఆగస్టు 30న భారతీయ మార్కెట్లోకి Xiaomi కొత్త పరికరాలు.. వివరాలిలా..
Xiaomi New Products: ఆగస్టు 30న భారతీయ మార్కెట్లోకి Xiaomi కొత్త పరికరాలు.. వివరాలిలా..
Xiaomi New Products: వినియోగదారుల ఆసక్తికి, అభిరుచికి అనుగుణంగా Xiaomi ఇండియా పలు స్మార్ట్ ఫోన్స్, ఇతర గడ్జెట్స్ లను అందిస్తుంది. ఈ కోవలోకే టీవీలు కూడా చేరుతాయి. ఆగస్టు 30 మార్కెట్లో మరి కొన్ని పరికరాలు విడుదల కానున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
Xiaomi ఇండియా ఆగష్టు 30 న భారతీయ మార్కెట్లో కొత్త పరికరాలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే ఈవెంట్లో కొన్ని కొత్త డివైజ్‌లను పరిచయం చేయనున్నట్లు Xiaomi ప్రకటించింది.
2/ 5
ఈ సందర్భంలోనే Xiaomi నోట్‌బుక్ ప్రో 120G ల్యాప్‌టాప్ అండ్ స్మార్ట్ టీవీ X సిరీస్ మోడల్‌లు ప్రారంభించబడతాయని నిర్ధారించబడింది.
3/ 5
కొత్త పరికరాల విడుదలకు సంబంధించిన టీజర్లలో.. నోట్‌బుక్ ప్రో 120G మోడల్ వేగంగా అండ్ మెరుగైనదిగా చెప్పబడింది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ నోట్ బుక్ ప్రో మోడల్ బెస్ట్ రిజల్యూషన్ తో వస్తుందని పేర్కొంది. (image: Xiaomi India)
4/ 5
టీజర్ చిత్రాల ప్రకారం.. ఇది ల్యాప్‌టాప్ 2021 మోడల్‌ను పోలి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో అందించబడే ఫీచర్ల గురించి Xiaomi ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
పేరును బట్టి చూస్తే.. ఈ నోట్‌బుక్‌లోని 120G కోడ్ 120Hz స్క్రీన్‌ను సూచించవచ్చు. ఈ ల్యాప్‌టాప్ అనేది.. రెడ్‌మిబుక్ ప్రో 15 మోడల్, రెడ్మి బుక్ ప్రో మోడల్‌కి కొద్దిగా సర్దుబాటు చేసిన వెర్షన్‌గా కనిపిస్తోంది. (image: Xiaomi India)