Xiaomi Redmi K20 Pro | వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది షావోమీ. రెడ్మీ 7 సిరీస్‌లో వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తున్న షావోమీ ఇప్పుడు వన్‌ఫ్లస్ 7 సిరీస్‌కు పోటీగా రెడ్మీ కే 20, రెడ్మీ కే 20 ప్రో స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.
1. వన్‌ప్లస్ 7 రిలీజ్ అయినప్పటి నుంచి 'ఫ్లాగ్షిప్ కిల్లర్ 2.0' పేరుతో కొన్నిరోజులుగా టీజర్లు ఇస్తోంది షావోమీ. చివరకు రెండు ఫోన్లను చైనాలో మాత్రమే రిలీజ్ చేసింది. రెడ్మీ కే20 ప్రో అవెంజర్ ఎడిషన్ చైనాలో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. (image: Xiaomi)
2/ 15
2. రెడ్మీ కే 20, రెడ్మీ కే 20 ప్రో ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. పోకో ఎఫ్2 స్థానంలో వీటిని ఇండియాలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. (image: Xiaomi)
3/ 15
3. రెడ్మీ కే 20, రెడ్మీ కే 20 ప్రో ఫోన్లల్లో పాప్-అప్ సెల్ఫీ కెమెరా, గేమ్ టర్బో 2.0 లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రీమియం డిజైన్లతో వచ్చిన ప్రీమియం స్మార్ట్ఫోన్లు ఇవి. (image: Xiaomi)
4/ 15
4. రెడ్మీ కే 20 స్పెసిఫికేషన్స్ చూస్తే 6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్ ఉండం విశేషం. (image: Xiaomi)
6. రెడ్మీ కే 20 బ్యాటరీ 4000 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై. (image: Xiaomi)
7/ 15
7. రెడ్మీ కే 20 గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ ధర సుమారు రూ.20,000 కాగా, 6జీబీ+128జీబీ ధర సుమారు రూ.21,000. (image: Xiaomi)
8/ 15
8. రెడ్మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.35 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉన్నాయి. (image: Xiaomi)
10. రెడ్మీ కే 20 ప్రో బ్యాటరీ 4000 ఎంఏహెచ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై. (image: Xiaomi)
11/ 15
11. రెడ్మీ కే 20 ప్రో గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ ఫైబర్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. (image: Xiaomi)
12/ 15
12. రెడ్మీ కే 20 ప్రో 6జీబీ+64జీబీ ధర సుమారు రూ.25,000 కాగా 6జీబీ+128జీబీ ధర సుమారు రూ.26,000. హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర సుమారు రూ.28,000 కాగా 8జీబీ+256జీబీ ధర సుమారు రూ.30,000. (image: Xiaomi)