Redmi Note 10: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే
Redmi Note 10: ఈ స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే
Redmi Note 10 | రెడ్మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. ఈ ఫోన్ ధర పెంచింది షావోమీ ఇండియా. లేటెస్ట్ రేట్‌తో పాటు ఈ ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకోండి.
1. షావోమీ మార్చిలో రెడ్మీ నోట్ 10 సిరీస్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. రెడ్మీ నోట్ 10, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత రెడ్మీ నోట్ 10ఎస్ మోడల్ని కూడా లాంఛ్ చేసింది. (image: Redmi India)
2/ 12
2. రెడ్మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ ధర రూ.11,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.13,999. ఆ తర్వాత ధర రూ.500 పెరిగింది. దీంతో 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.12,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,499 ధరకు పెరిగింది. (image: Redmi India)
3/ 12
3. ఇప్పుడు మరోసారి రెడ్మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ ధర పెరిగింది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధరను రూ.500 పెంచింది షావోమీ. దీంతో ఇప్పుడు రెడ్మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999 కి చేరుకుంది. (image: Redmi India)
4/ 12
4. రెడ్మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రిలీజ్ నుంచి ఇప్పటి వరకు రూ.1,000 పెరగడం విశేషం. ఇక 4జీబీ+64జీబీ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు లేదు. (image: Redmi India)
5/ 12
5. రెడ్మీ నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. (image: Redmi India)