1. షావోమీ ఇండియా ఈ ఏడాది మార్చిలో రెడ్మీ 11 సిరీస్‌లో రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ (Redmi Note 11 Pro + 5G) మొబైల్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో రెడ్మీ నోట్ 12 సిరీస్ లాంఛ్ కానుంది. దీంతో రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ ధర తగ్గించింది షావోమీ. మూడు వేరియంట్ల ధరల్ని రూ.2,000 వరకు తగ్గించింది. (image: Xiaomi India)
2. రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.1,000 తగ్గగా, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్ల ధర రూ.2,000 తగ్గింది. ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్ ధర రూ.22,999. (image: Xiaomi India)
3. అమెజాన్‌లో రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ కొనేవారికి బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెక్స్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులపైనే ఆఫర్స్ ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.3,000 నుంచి ప్రారంభం అవుతుంది. (image: Xiaomi India)
4. రెడ్మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ వివో టీ1, రియల్మీ 9 ప్రో, మోటో జీ71, మోటో జీ62, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ స్మార్ట్ఫోన్లలో కూడా ఉంది. (image: Xiaomi India)
6. రెడ్మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్, బ్లూటూత్ 5.1, డ్యూయెల్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)