1. షావోమీ ఇండియా నుంచి గతేడాది దసరా, దీపావళి సేల్ సమయంలో షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ (Xiaomi 11 Lite NE 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.7,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అమెజాన్‌లో షావోమీ ఫ్లాగ్షిప్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు ప్రీపెయిడ్ డిస్కౌంట్ ద్వారా భారీ తగ్గింపు ధరకే ఈ మొబైల్ కొనొచ్చు. (image: Xiaomi India)
2. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ అసలు ధరలు చూస్తే 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.5,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ.2,000 ప్రీపెయిడ్ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. రెండు ఆఫర్లు కలిపి రూ.7,000 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Xiaomi India)
3. ఉదాహరణకు మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.10,000 ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ లభిస్తే అదనంగా రూ.5,000 డిస్కౌంట్ కలిపి మొత్తం రూ.15,000 తగ్గింపు పొందొచ్చు. ప్రీపెయిడ్ ద్వారా కొంటే మరో రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. అంటే మొత్తం రూ.17,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.9,999 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.11,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Amazon India)
4. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఇంకా ఎక్కువ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ వస్తే మరింత డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ తక్కువగా ఉంటే మీరు ఇంకాస్త ఎక్కువ మొత్తం చెల్లించాలి. షావోమీ ఫ్లాగ్షిప్ డేస్ సేల్‌లో ఈ ఆఫర్ జనవరి 10 వరకే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ పాత ధరల్లోనే షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. (image: Xiaomi India)
5. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉండటం విశేషం. దీంతో పాటు 4జీ ఎల్టీఈ, వైఫై 6, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. (image: Xiaomi India)
6. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ టెలీమ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. (image: Xiaomi India)
7. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 4,250ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ బాక్సులోనే ఇస్తోంది షావోమీ. షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను టుస్కానీ కోరల్, వినైల్ బ్లాక్, జాజ్ బ్లూ, డైమండ్ డాజిల్ కలర్స్‌లో కొనొచ్చు. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. (image: Xiaomi India)