చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి, భారత్‌లో మోస్ట్ పాపులర్ బ్రాండ్‌గా రాణిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి విడుదలయ్యే ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. షియోమి ఉత్పత్తులకు అతి పెద్ద మార్కెట్ భారత్ కావడం విశేషం. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లు గల ఉత్పత్తులను విడుదల చేస్తూ ఇక్కడి యూజర్లకు చేరువైంది. ఇప్పుడు అమ్మకాలు పెంచుకునేందుకు క్రిస్మస్ సేల్‌తో ముందుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
రాబోయే క్రిస్మస్ పండుగను దృష్టిలో పెట్టుకొని ఆఫర్ల వర్షం కురిపించింది. షియోమి బ్రాండ్‌కు చెందిన అనేక స్మార్ట్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో షియోమి స్మార్ట్ఫోన్లు, యాక్సెసరీలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇలా ప్రతిదానిపై అదిరిపోయే డీల్స్ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ. 4,500 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. షియోమి క్రిస్మస్ సేల్ ఇప్పటికే కంపెనీ అధికారిక ఇండియన్ వెబ్సైట్లో ప్రారంభమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో అదనపు డిస్కౌంట్.. షియోమి క్రిస్మస్ సేల్‌లో కేవలం స్మార్ట్ఫోన్లపైనే కాదు స్మార్ట్ స్పీకర్లపై కూడా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఎంఐ స్మార్ట్ స్పీకర్ అసలు ధర రూ. 3,999 వద్ద ఉండగా.. దీన్ని కేవలం రూ. 1,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, షియోమి ఎంఐ రోబోట్ వ్యాక్యుమ్ మోప్ పి, ఎంఐ 360 హోమ్ సెక్యూరిటీ కెమెరా 2K ప్రో, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5, ఎంఐ వాచ్ రివాల్వ్ ఇలా అన్ని స్మార్ట్ ఉత్పత్తులు తగ్గింపు ధరలలోనే లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)