డచ్ పోర్టల్ LetsGoDigital లో ప్రచురించబడిన ఇటీవలి రెండర్ల ప్రకారం, Xiaomi 12 రెండర్లు గుండ్రని ఆకారంతో పెద్ద కెమెరా మాడ్యూల్‌ను అందిస్తున్నట్టు పేర్కొంది. ఇప్పుడు, కెమెరా మాడ్యూల్ దాని పాత మోడల్లా పెద్దదిగా ఉన్నప్పటికీ, Xiaomi 12 అల్ట్రా యొక్క రెండర్లు స్మార్ట్‌ఫోన్‌లో లుక్ అదిరిపోయింది. (Image Credit: LetsGoDigital)
నివేదిక ప్రకారం, Xiaomi 12 అల్ట్రా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల QHD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది హోల్-పంచ్ డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఇన్‌బిల్ట్ అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 2డి ఫేస్ అన్‌లాక్, స్టీరియో స్పీకర్లు, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 సర్టిఫికేషన్ రాబోయే Xiaomi 12 అల్ట్రా యొక్క ఇతర అంచనా ఫీచర్లు. ఈ హ్యాండ్సెట్ Qualcomm Snapdragon 8 Gen 1 ద్వారా పవర్ చేయబడుతుందని చెప్పబడింది. ఇది 5,000mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు.(Image Credit: LetsGoDigital)