1. షావోమీ ఇటీవల రిలీజ్ చేసిన ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.10,000 డిస్కౌంట్ లభిస్తోంది. షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro) స్మార్ట్‌ఫోన్‌పై తొలి సేల్‌లో రూ.10,000 డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మే మొదటివారంలో సేల్ ప్రారంభమైంది. ఇప్పుడు అమెజాన్‌లో మరోసారి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 డిస్కౌంట్‌తో కొనొచ్చు. (image: Xiaomi India)
2. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999. బ్యాంక్ ఆఫర్స్ వివరాలు చూస్తే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.6,000, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.1,500, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో రూ.1500 డిస్కౌంట్ పొందొచ్చు. (image: Xiaomi India)
3. బ్యాంక్ కార్డులతో రూ.6,000 వరకు డిస్కౌంట్, అమెజాన్ కూపన్‌తో రూ.4,000 తగ్గింపు పొందొచ్చు. బ్యాంకు ఆఫర్స్, అమెజాన్ కూపన్ ఆఫర్‌తో కలిపి రూ.10,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్‌తో షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.52,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.56,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Xiaomi India)
4. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల రిలీజైన రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ 10ప్రో, ఐకూ 9 ప్రో, మోటో ఎడ్జ్ 30 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్ఫోన్లలో ఉంది. (image: Xiaomi India)
5. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మూడు కెమెరాలు 50మెగాపిక్సెల్ సెన్సార్లతో ఉండటం హైలైట్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX707 సెన్సార్ + 50మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 50మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. (image: Xiaomi India)
6. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. బూస్ట్ మోడ్‌తో 18 నిమిషాల్లో 100శాతం, స్టాండర్డ్ మోడ్‌లో 24 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. 50వాట్ వైర్లెస్ టర్బో ఛార్జింగ్, 10వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. (image: Xiaomi India)
7. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడేళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, నాలుగేళ్లు సెక్యూరిటీ సపోర్ట్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. బ్లూ, గ్రే, పర్పుల్ కలర్స్‌లో కొనొచ్చు. (image: Xiaomi India)